హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. కాసేపటిక్రితమే ప్రారంభమైన వర్షం నగర వ్యాప్తంగా విస్తరిస్తోంది. సిటీలోని పంజాగుట్ట, బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మణికొండ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వెంటనే హైడ్రా, డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.