తెల్లంగాణలోని పలు జిల్లాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం దంచికొట్టింది. కామారెడ్డి పట్టణంలో భారీ వర్షం కురిసింది. అటు కరీంనగర్ (D) వీణవంక, తిమ్మాపూర్, హుజూరాబాద్‌లో, పెద్దపల్లి(D) కాల్వశ్రీరాంపూర్, సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, వరంగల్(D) చెన్నారావుపేట, నర్సంపేట, దుగ్గొండితో పాటు పలు మండలాల్లో భారీ వర్షం పడింది. మరోవైపు ఏపీలోని విజయనగరం(D) రేగిడి మండలంలోనూ వర్షం కురుస్తోంది. ఇవాళ రాత్రి వరకు నైరుతి రుతుపవనాలు కేరళం తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున TGలో భారీ వర్షాలు పడతాయని HYD వారవరణ శాఖ హెచ్చరించింది.