శంషాబాద్‌లో భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం (వీడియో)

7చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. శంషాబాద్, ఆరాంఘర్ పరిసరాల్లో మోకాళ్ల లోతు నీరు చేరడంతో జాతీయ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఊహించని ఈ జలదిగ్బంధంతో వాహనదారులు, రోడ్డు పక్కన దుకాణాల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాపుల్లోకి నీరు చేరడంతో వ్యాపారులు మోటార్లతో నీటిని బయటకు పంపేందుకు శ్రమిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే రహదారులు, ఓఆర్ఆర్ రింగ్ రోడ్ కూడా జలమయమయ్యాయి. దీంతో విమానాశ్రయ ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్