ఏపీ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ వర్షాలు దంచికొడుతున్నాయి. తిరుమలలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో భక్తులు వానలో తడిసిపోయారు. అలాగే వరద నీటికి రోడ్లు జలమయమయ్యాయి. అటు TGలోని వికారాబాద్ జిల్లాలో కూడా వర్షం దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. విత్తనాలు వేయడానికి ఈ వర్షం ఎంతో శుభపరిణామం అని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.