తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. TGలోని కరీంనగర్, WGL, జనగామలో భారీ వర్షం కురిసింది. కాగా WGLలో ఒక్కసారిగా కురిసిన ఈ వర్షం కారణంగా ఏనుమామూల మార్కెట్ లోని పత్తి, మొక్కజొన్న ధాన్యం తడిసిపోయింది. మధ్యాహ్నం నుంచి HYDలోనూ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. అటు ఏపీలోని అనంతపురం, నంద్యాలలో మోస్తరు వాన పడుతోంది.