భారీ వర్షం.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరికలు

11148చూసినవారు
భారీ వర్షం.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరికలు
TG: హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, విద్యుత్ వివిధ విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కుంభవృష్టి పడుతుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్లలో నుండి బయటకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్