దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం

9933చూసినవారు
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. అస్సాం, కేరళ, గుజరాత్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో జనజీవనం స్తంభించింది. అస్సాంలో 80 మంది మృతి చెందగా, 1.92 లక్షల మందికి పైగా ప్రభావితమయ్యారు. కేరళలోని పతనంతిట్టలో రెండు గంటల్లోనే 300 మి.మీ. వర్షపాతం నమోదైంది. కిష్త్వార్‌లో క్లౌడ్‌బర్స్ట్, మహారాష్ట్రలో ఫ్లైఓవర్ కుంగడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. బాధితుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్