భారీ వర్షాలు.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: రేవంత్ రెడ్డి

5502చూసినవారు
భారీ వర్షాలు.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: రేవంత్ రెడ్డి
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడు కార్పొరేషన్ల కమిషనర్లు సమన్వయంతో పనిచేయాలని, హైడ్రా, పోలీసు కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. నగరంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లలో నీరు నిలవకుండా వెంటనే తొలగించాలని సీఎం నిర్దేశించారు.

సంబంధిత పోస్ట్