యమహా మోటర్స్ దేశీయ మార్కెట్‌లోకి నూతన మోడల్ FZ-X 2025 బైక్‌ను విడుదల చేసింది. హైబ్రిడ్ ఇంజిన్ టెక్నాలజీతో రూపొందించిన ఈ బైక్ ధర రూ.1,49,990గా (ఢిల్లీ షోరూమ్ ధర) నిర్ణయించారు. దీనితోపాటు నాన్-హైబ్రిడ్ వేరియంట్‌ను కూడా తీసుకొచ్చారు. ఈ మోడల్ ధర రూ.1,29,990గా నిర్ణయించారు. కొత్త టెక్నాలజీతో వస్తున్న ఈ బైకులు యువతలో ఆకర్షణగా మారే అవకాశం ఉంది.