తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసేపట్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రంగారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షం పడే అవకాశముందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.