తెలంగాణలో రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ సహా 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, హైదరాబాద్ సహా 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గణేష్ నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో చెరువులు, నదీ తీరాల వద్ద భక్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.