తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

11చూసినవారు
తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో.. వచ్చే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూన్ 28 నుంచి జూలై 1 వరకు వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్