భారీ వర్షం.. హోర్డింగ్ కూలి యువకుడి దుర్మరణం

15చూసినవారు
మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లా కర్జాత్ తాలూకా రాసిన్ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ ఈదురు గాలులు, బలమైన వర్షం కారణంగా రోడ్డు పక్కన ఉన్న ఒక అనధికారిక హోర్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై వెళ్తున్న 24 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్