దేశంలోని 14 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో సెప్టెంబర్ 26, 27 తేదీల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.