థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భారీ వర్షాలతో తీవ్ర వరదలు, జలమయమైన రహదారులు, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయి. రోడ్లపై వాహనాలు నీట మునిగిపోయాయి. జనజీవనం స్తంభించింది. దీంతో నగరంలోని మొత్తం 50 జిల్లాలను విపత్తు ప్రాంతాలుగా ప్రకటించారు. సెప్టెంబరు 27 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని థాయ్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మరిన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు.