ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముక్తేశ్వర్‌లో 128 మి.మీ., కోశియాకుటోలీలో 94 మి.మీ. వర్షపాతం నమోదైంది. తీవ్ర వర్షాల కారణంగా మంగళవారం భీమ్తాల్ సమీపంలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ భారీ వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోయింది.