జూన్ 28న పలు జిల్లాల్లో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

13చూసినవారు
జూన్ 28న పలు జిల్లాల్లో భారీ వర్షాలు: వాతావరణ శాఖ
TG: రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ శుభవార్త అందించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో, జూన్ 28న రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించనున్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులు కూడా ఎక్కువగా ఉంటాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్