TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. యాదాద్రి, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని తెలిపారు. దీంతో ప్రయాణికులు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.