
చైనాలో గూఢచర్యం చేస్తున్న తాబేళ్లు, చేపలు
చైనా దేశీయ భద్రతా మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, విదేశీ నిఘా సంస్థలు చైనా కోస్ట్లైన్కు సంబంధించిన అండర్వాటర్ మ్యాప్స్, సైనిక సమాచారాన్ని సేకరించడానికి తాబేళ్లు, చేపలను ఉపయోగిస్తున్నాయి. వాటికి సెన్సార్లు అమర్చి సముద్రంలోకి పంపి, సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నాయని తెలిపింది. ఈ గూఢచారి తాబేళ్లు, చేపలు నిర్దిష్ట ప్రదేశాల్లో ఈదుతూ సముద్ర పర్యావరణానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నాయని, ఆ సమాచారం ఉపగ్రహం ద్వారా విదేశాలకు చేరుతోందని పేర్కొంది.




