తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

15చూసినవారు
తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలో బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. రేపటిలోగా కేరళ, తమిళనాడులను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశాలున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్