
మహిళా కానిస్టేబుల్‌తో ఎస్సై వివాహేతర సంబంధం
నోయిడాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్పై అతని భార్య ప్రీతి శర్మ సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త ఓ మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని రైడ్ పేరుతో ఉత్తరాఖండ్ టూర్‌కి వెళ్లాడని ఆమె తెలిపింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై ప్రస్తుతం విధుల నుంచి సస్పెండ్‌లో ఉన్నారు. తన ఇద్దరు పిల్లల భవిష్యత్తు నాశనమవుతోందని, భర్త మానసికంగా వేధిస్తున్నాడని ప్రీతి ఆవేదన వ్యక్తం చేసింది. వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.




