తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీలోని శ్రీసత్యసాయి, కడప, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ వాన పడింది. తెలంగాణలోని హైదరాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులపై వరద నీరు చేరింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.