AP: తిరుమలలో దిత్వా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను తాత్కాలికంగా మూసివేసింది. అలిపిరి ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు హెచ్చరికలు జారీ చేయగా, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. భారీ వర్షాలతో తిరుమలలోని ఐదు డ్యాములు నిండిపోగా, పాపవినాశనం, గోగర్భం డ్యాముల గేట్లు తెరిచి నీటిని విడుదల చేశారు. తుఫాను నేపథ్యంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు.