ముంబైని ముంచెత్తిన భారీ వర్షం.. రెడ్ అలర్ట్ జారీ (వీడియో)

11619చూసినవారు
ఆర్థిక రాజధాని ముంబై మరోసారి వర్షాల దెబ్బకు నిలిచిపోయింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో రోడ్లు చెరువులను తలపించాయి. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. కాగా, ముంబైలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరిస్తూ.. రెడ్ అలర్ట్ జారీ చేసింది. థానే, రాయ్‌గడ్, పూణె సహా పలుచోట్ల ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్