హిమాలయ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. కేదార్‌నాథ్, బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్ తీర్థ యాత్రలను తాత్కాలికంగా రద్దు చేసింది. వర్షాల కారణంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆలయాలకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. దీంతో ఆలయ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు అధికారులు వాహనాలను నిలిపివేయనున్నారు.