TG: రాష్ట్రంలో రాబోయే రెండు గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, నారాయణపేట జిల్లాల్లో స్వల్ప నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.