భారీ వర్షాలు.. 7KM వెళ్లేందుకు రూ.800 ఛార్జ్!

5చూసినవారు
హరియాణాలోని గురుగ్రామ్‌లో బెంగళూరు యువతికి ఊహించని అనుభవం ఎదురైంది. 7 కిలోమీటర్ల ప్రయాణానికి ఆటోడ్రైవర్ రూ.800 డిమాండ్ చేసినట్లు ఆమె ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. ట్రాఫిక్ సమస్య అనగానే బెంగళూరు గుర్తుకు వస్తుందని, ఇది ఇంకా క్రేజీగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ వీడియోపై స్పందించిన ఓ నెటిజన్, తాను 4 కిలోమీటర్లకు రూ.500 చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రంగా ఉంది.

సంబంధిత పోస్ట్