TG: బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో కలెక్టర్లు సెలవు ప్రకటించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తాయని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. కలెక్టరేట్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.