తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం సిరిపురం గ్రామంలో వృద్ధురాలు నిమ్మగళ్ల పెంటమ్మ (80) మృతి చెందగా, శ్మశానవాటికకు మృతదేహాన్ని తరలించడంలో గ్రామస్థులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో మార్గం తెగిపోయింది. చివరికి ట్రాక్టర్ సాయంతో వాగు దాటించి అంత్యక్రియలు నిర్వహించారు.