
పట్టపగలే కత్తులతో యువకుల హల్చల్! (వీడియో)
AP: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో పట్టపగలే కొందరు యువకులు వీరంగం సృష్టించారు. విక్టరీ వైన్స్ ముందు కత్తులతో రెచ్చిపోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా యువకులు ప్రవర్తించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి వారు డిమాండ్ చేస్తున్నారు.




