తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు!

10390చూసినవారు
తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు!
TG: ఉత్తరాంధ్ర తీరానికి సమీపిస్తున్న తీవ్ర వాయుగుండం ప్రభావం తెలంగాణపైనా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో సెప్టెంబర్‌ 24, 25 తేదీల్లో వర్షాల తీవ్రత పెరగనుందని పేర్కొన్నారు. ముఖ్యంగా భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తాజా అంచనాల ద్వారా వెల్లడించారు. అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్