హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ప్రజలు సొంతూళ్లకు బయలుదేరడంతో రద్దీ పెరిగింది. దీనికి తోడు రోడ్డు పనులు కొనసాగుతుండటంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. విజయవాడ వైపు చౌటుప్పల్ నుంచి ఎల్లంబావి వరకు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దండుమల్కాపురం వద్ద 3 కిలోమీటర్ల మేర రద్దీ నెలకొంది. ట్రాఫిక్ పోలీసులు రద్దీని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు.