సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ భారీగా పెరిగింది. చౌటుప్పల్ సమీపంలోని పంతంగి, కేతేపల్లి వద్ద కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒక్కో టోల్ గేట్ దాటేందుకు సుమారు రెండు గంటల సమయం పడుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తు ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.