అభిమాని ఇంట్లో హీరో అఖిల్ సందడి (వీడియో)

83చూసినవారు
AP: విజయవాడలో హీరో అఖిల్ అక్కినేని సందడి చేశారు. అక్కినేని నాగేశ్వరరావు కాలం నాటి ఒక సీనియర్ అభిమానిని కలిసి ఆయన కాసేపు ముచ్చటించారు. ఆ అభిమాని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న అఖిల్.. వారితో కాసేపు సమయం గడిపారు. ఈ క్రమంలో అభిమాని ఎమోషనల్ అవ్వగా.. ఆయనను అఖిల్ అప్యాయంగా దగ్గరకు తీసుకుని ఓదార్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్