తండ్రి మృతి.. బోరున ఏడ్చేసిన హీరో జీవా

14చూసినవారు
తండ్రి మృతి.. బోరున ఏడ్చేసిన హీరో జీవా
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సినీ నిర్మాత ఆర్‌బీ చౌదరి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్త తెలిసి ఆయన కుమారుడు, హీరో జీవా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ క్రమంలో ఇంటి బయట ఫోన్లో మాట్లాడుతూ బోరున విలపించారు. పరామర్శకు వచ్చిన వారిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా చౌదరి అంత్యక్రియలు రేపు చెన్నైలో జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్