రాజస్థాన్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత RB చౌదరి మృతి చెందిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన భౌతికకాయాన్ని చెన్నైలోని నివాసానికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో తండ్రి బౌతికకాయాన్ని చూసి తమిళ హీరో జీవా బోరున విలపించారు. ఆయన్ను చూసి చుట్టుపక్కల ఉన్నవాళ్లు సైతం కంటతడి పెట్టారు. రేపు చౌదరి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. కాగా పలువురు ప్రముఖులు చౌదరికి నివాళులు అర్పించారు.