మేడారంలో హీరో నాని.. సమ్మక్క-సారలమ్మకు ప్రత్యేక పూజలు

8చూసినవారు
ప్రముఖ సినీ నటుడు నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మంగళవారం తెలంగాణలోని ములుగు జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని గట్టమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం, వారు మేడారంలోని సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. మేడారంలో గిరిజన పూజారుల ఘన స్వాగతం అందుకున్న నాని, తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పర్యటనలో నటుడు సంపూర్ణేష్ బాబు, నిర్మాత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్