కడప పెద్ద దర్గాను దర్శించుకున్న హీరో సుమన్ (వీడియో)

3చూసినవారు
AP: ఉరుసు సందర్భంగా కడప పెద్ద దర్గాకు వచ్చిన సినీ నటుడు సుమన్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవాలని కోరుకుంటున్నానని తెలిపారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎంతో చక్కగా పని చేస్తోందని, ప్రజల మద్దతు పొందుతోందని సుమన్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తాను ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, రేవంత్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు.