హోటల్ గదుల్లో రహస్య కెమెరాలు: జాగ్రత్తలు తప్పనిసరి

8428చూసినవారు
హోటల్ గదుల్లో రహస్య కెమెరాలు: జాగ్రత్తలు తప్పనిసరి
విదేశీ పర్యటనల్లో హోటల్ గదుల్లో గోప్యత చాలా ముఖ్యం. అలారం గడియారాలు, ఛార్జర్లు, స్విచ్ బోర్డులు, ఫోటో ఫ్రేమ్‌లు, అద్దాలు వంటి వాటిలో రహస్య కెమెరాలు ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  కావున లైట్లు ఆపి ఫోన్ కెమెరాతో చూస్తే ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు కనిపించినప్పుడు జాగ్రత్త పడాలని పేర్కొంటున్నారు. అనుమానం వస్తే ఫోటో తీసి యాజమాన్యానికి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అలాగే పబ్లిక్ వైఫైలో బ్యాంకింగ్ లావాదేవీలు చేయరాదు. స్మార్ట్ టీవీలు, స్పీకర్లను వాడిన తర్వాత లాగౌట్ చేయాలి.

సంబంధిత పోస్ట్