తెలంగాణలో జనసేనతో పొత్తు అంశంపై రాష్ట్ర
బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు. రాజకీయ పరిస్థితులను బట్టి పొత్తులపై ముందుకెళ్తామని, జనసేనతో పొత్తుపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. గురువారం ‘మీట్ ది ప్రెస్’లో రాంచందర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో పవన్ సభకు ఎందుకు అనుమతివ్వలేదని ప్రశ్నించిన ఆయన, పవన్ సభ అనేసరికి BRS, INC గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయన్నారు. సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని ఆ పార్టీలు యత్నిస్తున్నాయని ఆరోపించారు.