నేటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

10చూసినవారు
నేటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు
TG: హైకోర్టు ఈ నెల 7 నుంచి జూన్‌ 5 వరకు వేసవి సెలవులు ప్రకటించింది. ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణ కోసం వెకేషన్‌ బెంచ్‌లు ఏర్పాటు చేశారు. మే 14, 21, 28, జూన్‌ 4 తేదీల్లో పనిచేసే ఈ బెంచ్‌లలో హెబియస్‌ కార్పస్‌, ముందస్తు బెయిలు, బెయిలు దరఖాస్తులు, కూల్చివేతలు వంటి అత్యవసర కేసులను జస్టిస్‌ టీ మాధవీదేవి, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌, జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌, జస్టిస్‌ నగేశ్‌ భీమపాక, జస్టిస్‌ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్‌ సుద్దాల చలపతిరావు విచారిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్