TG: అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పోలీసుల దురుసు ప్రవర్తనపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. మహిళా ఎమ్మెల్యేలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించి, వారి వివరాలను స్పీకర్‌కు అందజేయాలని డీజీపీని ఆదేశించింది. ఘటన అసెంబ్లీ ప్రాంగణంలో జరిగితే, ఆ వివరాలను హైకోర్టుకు నివేదించాలని సూచించింది. అసెంబ్లీ నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.