సమంత ఫేస్‌, వాయిస్‌ దుర్వినియోగంపై హైకోర్టు కీలక ఆదేశాలు

42చూసినవారు
సమంత ఫేస్‌, వాయిస్‌ దుర్వినియోగంపై హైకోర్టు కీలక ఆదేశాలు
సమంత పేరు, ఫొటో, గొంతు, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా ఉపయోగించే డీప్‌ఫేక్‌, మార్ఫింగ్‌ కంటెంట్‌పై బాంబే హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. అలాంటి కంటెంట్‌ను తొలగించాలని గూగుల్‌, మెటా సహా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లను జస్టిస్‌ మాధవ్‌ జమ్దార్‌ బెంచ్‌ ఆదేశించింది. తనను పోలిన AI చాట్‌బాట్‌లు, ఫేక్‌ వీడియోలు, AI వాయిస్‌ కంటెంట్‌ సృష్టిస్తున్నారంటూ సమంత కోర్టును ఆశ్రయించారు. ఆమె వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రాజ్యాంగ పరిరక్షణ ఉందని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ డిసెంబరు 10కి వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్