ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


99 శాతం మంది పీలుస్తున్న‌ది కాలుష్య‌పు గాలినే!
Sep 02, 2026, 13:09 IST/

99 శాతం మంది పీలుస్తున్న‌ది కాలుష్య‌పు గాలినే!

Sep 02, 2026, 13:09 IST
వాయు కాలుష్యం క్యాన్సర్ ముప్పును పెంచుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. 2000-2020 మధ్య 952 ప్రాంతాల్లో నమోదైన 10.9 కోట్ల క్యాన్సర్ కేసులను పరిశీలించిన పరిశోధకులు.. పీఎం2.5 కాలుష్యాన్ని ప్రధాన ప్రమాద కారకంగా గుర్తించారు. గాలిలో పీఎం2.5 స్థాయి ప్రతి క్యూబిక్ మీటర్‌కు 10 మైక్రోగ్రాములు పెరిగితే క్యాన్సర్ ముప్పు 17.9 శాతం పెరిగినట్లు తేలింది. కిడ్నీ, మూత్రాశయం, ఊపిరితిత్తులతో పాటు ఇతర అవయవాల క్యాన్సర్లతోనూ పీఎం2.5కు సంబంధం ఉన్నట్లు అధ్యయనం సూచించింది. ప్రపంచ జనాభాలో 99 శాతం మంది డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలకు మించిన కాలుష్యాన్ని పీలుస్తున్నారని పరిశోధకులు తెలిపారు.