‘ఓజీ’ టికెట్‌ ధరల పెంపు ఉత్తర్వులు.. సస్పెండ్ చేసిన హైకోర్టు

23679చూసినవారు
‘ఓజీ’ టికెట్‌ ధరల పెంపు ఉత్తర్వులు.. సస్పెండ్ చేసిన హైకోర్టు
పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘ఓజీ’ సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులకు తెలంగాణ హైకోర్టు బ్రేక్‌ వేసింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక అనుమతిని సస్పెండ్ చేస్తూ జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో టికెట్ ధరలు మునుపటి రేట్లకే పరిమితం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ‘ఓజీ’ సినిమాకు హైప్‌ దృష్ట్యా టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిర్ణయంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు తాత్కాలికంగా ఉత్తర్వులను నిలిపివేసింది.

సంబంధిత పోస్ట్