‘జనాభా మార్పు’పై కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ

185చూసినవారు
‘జనాభా మార్పు’పై కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ
దేశంలో చొరబాట్లు, ఇతర కారణాలతో ఏర్పడే జనాభా మార్పు ఒక సవాలని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. దీని పరిష్కారానికి ప్రధాని మోదీ ప్రకటన మేరకు 'జనాభా మార్పుపై ఉన్నత స్థాయి కమిటీ'ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్‌ ప్రభాకర్ నావ్‌లేకర్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని 'ఎక్స్‌' వేదికగా వెల్లడించారు. దేశవ్యాప్తంగా అక్రమ వలసలు, ఇతర కారణాలతో జరుగుతున్న జనాభా మార్పును ఈ కమిటీ విశ్లేషించనుంది.

సంబంధిత పోస్ట్