హై సెక్యూరిటీ ప్లేట్లు తప్పనిసరి కాదు: రవాణా శాఖ

5899చూసినవారు
హై సెక్యూరిటీ ప్లేట్లు తప్పనిసరి కాదు: రవాణా శాఖ
TG: రాష్ట్రంలోని పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (హెచ్ఎస్ఆర్‌‌పీ) తప్పనిసరి కాదని, దీనికి ఎలాంటి గడువు విధించలేదని రవాణా శాఖ అధికారులు తెలిపారు. హెచ్ఎస్ఆర్ పీ నంబర్ ప్లేట్లు లేకుంటే ఆర్టీఏ అధికారులుగానీ, ట్రాఫిక్ పోలీసులుగానీ ఎలాంటి ఫైన్‌లు వేయరని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఈ విషయం ప్రస్తుతానికి ప్రభుత్వ పరిశీలనలో మాత్రమే ఉందని, వాహనదారులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :