పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలపై
అమెరికా మెరుపు దాడులు నిర్వహించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. డ్రోన్, క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని సమాచారం. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రతను కాపాడేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు
అమెరికా రక్షణ శాఖ తెలిపింది. తాజా పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో హై అలర్ట్ కొనసాగుతుండగా, అంతర్జాతీయంగా చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి.