TG: క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయకుండానే తెలంగాణ ప్రభుత్వం హిల్డ్ పాలసీని తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామికవాడలో పనిచేస్తున్న వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తకు లబ్ధి చేకూరుస్తోందని విమర్శించారు. పారిశ్రామికవేత్తలకు ఒక విధానం.. రైతులకు ఒక విధానమా? అని ప్రశ్నించారు.