హిల్ట్ పాలసీ వివాదం.. పోరుబాటకు సిద్ధమైన బీఆర్ఎస్

39చూసినవారు
హిల్ట్ పాలసీ వివాదం.. పోరుబాటకు సిద్ధమైన బీఆర్ఎస్
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (HILTP) పై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ (BRS) తీవ్ర ఆరోపణలు చేస్తోంది. రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. కేసీఆర్ ఆదేశాల మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నాయకులతో కూడిన 8 నిజనిర్ధారణ కమిటీలను నియమించారు. ఈ కమిటీలు రేపు, ఎల్లుండి హిల్ట్ పరిధిలోని పారిశ్రామిక వాడల్లో పర్యటించి ప్రభుత్వ తీరును ప్రజలకు వివరిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్